Homeతెలంగాణ28వ వార్డులో సీపీఐకు ఎదురుదెబ్బ

28వ వార్డులో సీపీఐకు ఎదురుదెబ్బ

 

ఖమ్మం, పెన్ పవర్, ఆగస్టు 17:

ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో సీపీఐకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వార్డుకు చెందిన ఆలేటి అవినాష్, దాచేపల్లి వినోద్ లు సీపీఐకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.కాంగ్రెస్ నాయకులు అక్కినేపల్లి దేవయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుడు భూక్యా సురేష్ నాయక్ సమక్షంలో అవినాష్, వినోద్ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 28వ వార్డు అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల రామ్మోహన్ రెడ్డితో కలిసి పార్టీ బలోపేతానికి, వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇదే వార్డుకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఈ నెల చివరి వారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular