Homeఆంధ్రప్రదేశ్చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. 7 మంది మృతి

చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. 7 మంది మృతి

మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక పురుషుడు

ఎనిమిది మందికి గాయాలు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండల పరిధిలోని జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.

ఈ ప్రమాదంలో మృతులంతా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారిగా సమాచారం. ప్రకాశం జిల్లా కొండమంజులూరులో జరిగిన పుట్టినరోజు వేడుకకు హాజరై తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. మృతులను బొంత బాబు (62), బొంత మనెమ్మ (55), సంపూర్ణమ్మ (70), లక్ష్మమ్మ (75), గంగమ్మ (50), చౌటుపల్లి సువర్త (45), మరియమ్మ (45)గా గుర్తించారు.

అర్ధరాత్రి 12.45 గంటలకు ప్రమాదం

అడ్డా రోడ్ సమీపంలో అర్ధరాత్రి 12.45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బస్సు–ఆటో ఢీకొనడంతో ఆటోలో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. నలుగురు ఘటనాస్థలంలోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు గుంటూరు జీజీహెచ్, చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

గాయపడిన ఎనిమిది మందిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంతో జాతీయ రహదారిపై కొంతసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular