Homeఆంధ్రప్రదేశ్బాపట్లఎన్‌సీసీ 2026 బ్యాచ్‌కు 11 మంది విద్యార్థిని ల ఎంపిక

ఎన్‌సీసీ 2026 బ్యాచ్‌కు 11 మంది విద్యార్థిని ల ఎంపిక

బాపట్ల, సెప్టెంబర్ 21 (పెన్ పవర్):  బాపట్ల ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎన్‌సీసీ 2026 బ్యాచ్ ఎన్‌రోల్‌మెంట్, ఎంపిక ప్రక్రియ సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎస్‌వీఎస్ సుదర్శన్ హాజరయ్యారు.

బెటాలియన్‌కు చెందిన సీనియర్ జీసీఐ జెస్సీ జెర్నాల్డ్, పీఐ సిబ్బంది హవల్దార్ షేక్ వలి ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. ఎంపిక అనంతరం 11 మంది విద్యార్థులు 2026 బ్యాచ్‌కు ఎన్‌సీసీ క్యాడెట్లుగా ఎంపిక కాగా, మరో ఆరుగురిని రిజర్వ్ జాబితాలో ఉంచారు. ఈ సందర్భంగా కల్నల్ ఎస్‌వీఎస్ సుదర్శన్ నూతనంగా ఎంపికైన క్యాడెట్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎన్‌సీసీలో క్రమశిక్షణ, బాధ్యత, సేవా భావానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. సీహెచ్ హిమ బిందు నూతన ఎన్‌సీసీ క్యాడెట్లను అభినందించి, క్రమశిక్షణతో విద్యతో పాటు దేశ సేవా భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఐ. హరిత, ఎన్‌సీసీ కేర్‌టేకర్ పి. నవాభా, ఎన్‌సీసీ అధికారులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular