సీతారాముల వారి ఆలయ అభివృద్ధికి రూ.2 లక్షల విరాళం
చీరాల, సెప్టెంబర్ 23, (పెన్ పవర్) :
చీరాల పట్టణంలోని 28వ వార్డులో తూర్పు రెడ్డిక యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 26వ వార్షికోత్సవ వినాయక చవితి ఉత్సవాల్లో చీరాల శాసనసభ్యులు మాలకొండయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక పందిరిలో ఏర్పాటు చేసిన వినాయక స్వామి ప్రతిమను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాలకొండయ్య సీతారాముల వారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.2 లక్షలను కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు ఎమ్మెల్యే మాలకొండయ్యను ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగల్లో వినాయక చవితి ఒకటని అన్నారు. భక్తిశ్రద్ధలతో వినాయకుడిని ప్రార్థిస్తే ఆయన కటాక్షంతో ప్రజల సమస్యలు తొలగి, సుఖసంతోషాలు కలుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఉత్సవ నిర్వాహకులు, కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

