Homeఆంధ్రప్రదేశ్బాపట్లటీడీపీలో చేరిన 50 కుటుంబాలు

టీడీపీలో చేరిన 50 కుటుంబాలు

చీరాల, సెప్టెంబర్ 23, (పెన్ పవర్) :

చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బూత్ నంబర్‌ 174 పరిధిలోని శారదానగర్‌, సిలోన్‌ కాలనీకి చెందిన 50 కుటుంబాలు బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఒలుకుల అయ్యప్ప ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారిని చీరాల శాసనసభ్యులు మాలకొండయ్య పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి సమష్టిగా పనిచేయాలని సూచించారు. కొత్తగా పార్టీలో చేరిన కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బూత్‌ స్థాయి ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular