Homeఆంధ్రప్రదేశ్బాపట్లసెరిబ్రల్ పాల్సీపై అవగాహన అవసరం

సెరిబ్రల్ పాల్సీపై అవగాహన అవసరం

పర్చూరు, అక్టోబర్ 7: ఉప్పుటూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం వద్ద ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ దాసరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ‘సెరిబ్రల్ పాల్సీ’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల్లో మెదడు ఎదుగుదలలో లోపాలు, ప్రసవ సమయంలో సమస్యలు, ఇన్ఫెక్షన్లు తదితర కారణాలతో సెరిబ్రల్ పాల్సీ వచ్చే అవకాశం ఉందన్నారు. శిశువుల్లో ఎదుగుదల, కదలికల్లో జాప్యం వంటి లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. గర్భిణులు పౌష్టికాహారం తీసుకుంటూ, వైద్యుల సూచనలు పాటించాలని తెలిపారు. సెరిబ్రల్ పాల్సీ పిల్లలకు సానుభూతి కంటే సమాన అవకాశాలు, అవసరమైన సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ బాలశ్యామల, ఆయా, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular