గంగవరం రంపచోడవరం, పెన్ పవర్, అక్టోబర్ 7:
సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వికసిత భారత్ సంకల్ప సభ, సేవా జ్యోతి యాత్రను రంపచోడవరంలో గురువారం ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు, సేవా జ్యోతి యాత్ర జిల్లా కన్వీనర్ మూడే సతీష్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఇక బుల్లికొండల దొర అధ్యక్షతన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఈ. స్వప్నకుమారి, జిల్లా ఇన్చార్జి గేదె శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్, వికసిత భారత్ లక్ష్యాలు, ప్రజాసేవలో పార్టీ కార్యకర్తల పాత్రపై నాయకులు వివరించారు.
సేవా జ్యోతి యాత్రలో భాగంగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి బీజేపీ నాయకులు, యువమోర్చా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

