Homeతెలంగాణవరి పంటలకు సాగునీటిని అందించాలి

వరి పంటలకు సాగునీటిని అందించాలి

గార్ల, పెన్ పవర్ ,అక్టోబర్: 9

గార్ల పెద్ద చెరువు పరిధిలో వరి పంటలు వేసుకున్న రైతాoగానికి సాగునీటిని విడుదల చేయాలని అఖిలపక్షం నాయకులు కందునూరి శ్రీనివాస్, గంగావత్ లక్ష్మణ్ నాయక్, కట్టెబోయిన.శ్రీనివాస్ గుగులోత్ సక్రు లు అధికారులను కోరారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని అఖిలపక్షo, రైతు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక నెహ్రు సెంటర్ లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ప్రదర్శనగా వెళ్లి తహసీల్దార్,ఎంపీడీవో, విద్యుత్ కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం అధిక వర్షపాతం నమోదు కాకపోవడంతో ఖరీఫ్ పంటలు పండని పరిస్థితి నెలకొందని, అయినప్పటికీ కొద్దిమంది పేద రైతులు ఆశలతో ఖరీఫ్ వరి పంటలను వేయడం జరిగిందని ఆ పంటలో ఎoడి పోకుండా సాగునీటి అందించాలని కోరారు. విద్యుత్ సరఫరా లో లో వోల్టేజ్ సమస్యల కారణంగా మిర్చి, పత్తి,వరి పంటలకు నీటిని అందించడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, విద్యుత్ కోత వలన గృహ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సమస్య ను పరిష్కరించి రైతులకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను తాసిల్దార్ శారద, ఎంపీడీవో ఎం మంగమ్మ, విద్యుత్ ఎఈ మధు లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి అలవాల సత్యవతి,మాజీ ఎంపిటిసి శీలంశెట్టి రమేష్,రైతు సంఘం రాష్ట్ర నాయకులు గడ్డిపాటి రాజారావు, వంగూరి వెంకటేశ్వర్లు,జె. వెంకన్న,డి.కై బాబు,కె.రామకృష్ణ,మిగడ శ్రీను,జి. వీరభద్రం, ఎస్ రాజు యాదవ్, టీ. నాగేశ్వరావు, సిహెచ్ గణేష్, మనోహర్, డి సక్రు, ఎం అశోక్, ఎం రాములు, శ్రీనాథ్, మహేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular