Homeఆంధ్రప్రదేశ్పార్టీ అధిష్టానం నాపై ఉంచిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తా

పార్టీ అధిష్టానం నాపై ఉంచిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తా

  • ✒️జనసేన పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త గొర్లే వీర వెంకట్
  •  గూడెం కొత్త వీధి , పెన్ పవర్, అక్టోబర్ 11: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాడేరు నియోజకవర్గ జనసేన పార్టీ త్రీమెన్ కమిటీ సమన్వయకర్తగా తనను నియమించినందుకు జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు గొర్లే వీర వెంకట్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డాక్టర్ వంపూరు గంగులయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, అప్పగించిన బాధ్యతలను అంతఃకరణ శుద్ధితో, చిత్తశుద్ధితో నిర్వహిస్తానని గొర్లే వీర వెంకట్ పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి, సమన్వయంతో పార్టీ శ్రేణులను ముందుకు నడిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular