Homeతెలంగాణరంగారెడ్డియాదవ మహిళా శక్తి బలోపేతమే లక్ష్యం

యాదవ మహిళా శక్తి బలోపేతమే లక్ష్యం

యాదవ మహిళా శక్తి బలోపేతమే లక్ష్యం

ఆవుల స్వరూప యాదవ్‌కు రాష్ట్ర మహిళా సెక్రటరీగా నియామకం

నియామక పత్రం అందజేసిన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బొంతు శ్రీదేవి యాదవ్

కాప్రా, పెన్ పవర్, నవంబర్ 6:

అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర మహిళా సెక్రటరీగా ఆవుల స్వరూప యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆమెకు నియామక పత్రాన్ని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బొంతు శ్రీదేవి యాదవ్ అందజేశారు.ఈ సందర్భంగా బొంతు శ్రీదేవి యాదవ్ మాట్లాడుతూ.. మహిళలు కేవలం కుటుంబానికే పరిమితం కాకుండా సమాజ నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చినప్పుడే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
యాదవ మహిళా శక్తిని మరింత బలోపేతం చేయడంతో పాటు, యాదవ మహిళలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ఆవుల స్వరూప యాదవ్ కృషి చేయాలని ఆకాంక్షించారు. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ మహాసభ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఆమెకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular