Homeతెలంగాణహైదరాబాద్ఉద్యమ జర్నలిస్టులకు అన్యాయం చేస్తే సహించేదిలేదు

ఉద్యమ జర్నలిస్టులకు అన్యాయం చేస్తే సహించేదిలేదు

ఉద్యమ జర్నలిస్టులకు అన్యాయం చేస్తే సహించేదిలేదు

శ్రీకాంతాచారికి ఉద్యమ జర్నలిస్టుల వినతి

ఉద్యమ జర్నలిస్టుల పేరుతో చేస్తున్న వసూళ్లను ఆపాలి

ఎల్బీనగర్, పెన్ పవర్, నవంబర్ 17:

తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ కోసం ప్రాణాలను సైతం అర్పించిన కాసోజు శ్రీకాంతాచారి సాక్షిగా, తెలంగాణ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించడానికి కారణమైన ఉద్యమ జర్నలిస్టులను ప్రభుత్వం మరిచిపోయిందని ఎల్బీనగర్ ఉద్యమ జర్నలిస్టులు శ్రీకాంతాచారి విగ్రహానికి మంగళవారం వినతిపత్రం అందజేసి నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా ఉద్యమ జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యమ జర్నలిస్టులను గుర్తించి జర్నలిస్టులకు రావాల్సిన హక్కులు, ప్రభుత్వం తరఫున అందాల్సిన అన్ని రకాల రాయితీలను కల్పించాలని కోరారు. ఈ మధ్య కాలంలో కొంతమంది జర్నలిస్టులు మేము ఉద్యమ జర్నలిస్టులమంటూ మీటింగ్‌లు పెడుతూ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
వారు ఉద్యమ జర్నలిస్టులు కారని, వారు ఉద్యమ కాలం నాటి జర్నలిస్టులు మాత్రమేనని, ఉద్యమ జర్నలిస్టుల పేరుతో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఉద్యమ జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో ఉద్యమ జర్నలిస్టులు, ఉద్యమకారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular