Homeతెలంగాణరంగారెడ్డితెలంగాణ జర్నలిస్టు ఉద్యమ చరిత్రను వక్రీకరిస్తే ఖబడ్దార్

తెలంగాణ జర్నలిస్టు ఉద్యమ చరిత్రను వక్రీకరిస్తే ఖబడ్దార్

తెలంగాణ జర్నలిస్టు ఉద్యమ చరిత్రను వక్రీకరిస్తే ఖబడ్దార్

ఉద్యమంలో ఆనాడు కనిపించని వారు.. నేడు ఉద్యమకారులమంటూ చరిత్రను వక్రీకరించడం సిగ్గుచేటు

అసలైన ఉద్యమకారుల త్యాగాలను తక్కువ చేసి చూపిస్తే సహించేది లేదు: టీజేఎఫ్

ఎల్బీనగర్, పెన్ పవర్, నవంబర్ 16:

ఎల్బీనగర్ లో తెలంగాణ జర్నలిస్టు ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తే ఏమాత్రం సహించేదిలేదని తెలంగాణ జర్నలిస్టు ఉద్యమకారుల ఫోరం (టీజేఎఫ్) తీవ్రంగా హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో ఎల్బీనగర్ జర్నలిస్టులు చేసిన పోరాటాలు, ఎదుర్కొన్న నిర్బంధాలు, ఒత్తిళ్లు, త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని స్పష్టం చేశారు. సోమవారం కొత్తపేటలో ఉద్యమ జర్నలిస్టులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా పలువురు ఉద్యమ జర్నలిస్టులు మాట్లాడుతూ.. ఆనాడు ఉద్యమంలో ఎక్కడా కనిపించని వారు, ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు నేడు తామే అసలైన ఉద్యమకారులమని చెప్పుకోవడం హాస్యాస్పదమే కాకుండా సిగ్గుచేటుగా ఉందని మండిపడ్డారు.

ఎల్బీనగర్ ప్రాంతంలో తెలంగాణ జర్నలిస్టు ఉద్యమ చరిత్రను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కొందరు ప్రయత్నించడం దురదృష్టకరమని అన్నారు. ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న నిజమైన ఉద్యమకారుల సేవలను విస్మరించి, సంబంధంలేని వ్యక్తులు ఉద్యమకారులుగా చలామణి కావాలని చూడటం చరిత్రను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమంలో ఎవరు ఎక్కడ ఉన్నారు? ఎవరు పోరాటంలో ముందుండి నడిచారు? ఎవరు ఉద్యమానికి అండగా నిలిచారు? అన్నది జర్నలిస్టు లోకానికి తెలుసని స్పష్టం చేశారు. చరిత్రను చెరిపేయడం ఎవరి తరమూ కాదని, వాస్తవాలను వక్రీకరించి తప్పుడు గుర్తింపు పొందాలనుకోవడం చరిత్రహీనులుగా మిగిలిపోవడమేనని ఘాటుగా విమర్శించారు.

అసలైన తెలంగాణ జర్నలిస్టు ఉద్యమకారుల పోరాటాలను తక్కువ చేసి చూపించే ప్రయత్నాలను తక్షణమే మానుకోవాలని, ఉద్యమ చరిత్రను వక్రీకరించకుండా వాస్తవాలను గౌరవించాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఐక్యతను దెబ్బతీసేలా వ్యవహరించవద్దని టీజేఎఫ్ నాయకులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉద్యమ జర్నలిస్టులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular