Homeతెలంగాణమేడ్చల్ మల్కాజ్‌గిరిఆర్టీఐ రక్షక్ సంస్థ ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా శ్రీవోజు వెంకటాచారి

ఆర్టీఐ రక్షక్ సంస్థ ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా శ్రీవోజు వెంకటాచారి

ఆర్టీఐ రక్షక్ సంస్థ ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా శ్రీవోజు వెంకటాచారి

ప్రజా హక్కుల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తా

కాప్రా, పెన్ పవర్, నవంబర్ 22

ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అవినీతి నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్న ఆర్టీఐ రక్షక్ సంస్థ ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా మల్లాపూర్ ఫేజ్‌-2 జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీకి చెందిన శ్రీవోజు వెంకటాచారి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం సంస్థ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్టీఐ సతీష్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా వెంకటాచారి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని యువతకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, నిధుల వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు తెలియజేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పాలనలో పారదర్శకత పెంపొందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular