Homeతెలంగాణమేడ్చల్ మల్కాజ్‌గిరిఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన ప్రదర్శనలు

ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన ప్రదర్శనలు

ఉప్పల్ మినీ శిల్పారామంలో అలరించిన ప్రదర్శనలు

కాప్రా, పెన్ పవర్, నవంబరు 28:

ఉప్పల్ మినీ శిల్పారామంలో శనివారం నృత్య జ్యోతి నాట్య శిక్షణాలయం గురువు డాక్టర్ బండి పేరిణి కుమార్ శిష్య బృందంచే ఆంధ్రనాట్యం ప్రదర్శన ఆహుతులను ఎంతగానో అలరించింది. ఈ సందర్భంగా పరమపురుషుడు, ఆధ్యాత్మరామాయణ కీర్తన, దశావతరము, పరమపురుషుడు, శబ్దం, శివ కైవారం తదితర అంశాలను కళాకారులూ ప్రదర్శించి మెప్పించారు. ఉస్తాద్ బిస్మిల్లాహ్ ఖాన్ యువ పురస్కార్ అవార్డు గ్రహీత సాత్విక పెన్నా, సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం గ్రహీత స్రవంతి రాకేష్ ను ఘనంగా సత్కరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular