Homeఆంధ్రప్రదేశ్పోలవరం జిల్లా కలెక్టర్ గా దినేష్ కుమార్

పోలవరం జిల్లా కలెక్టర్ గా దినేష్ కుమార్

పెన్ పవర్ గంగవరం పోలవరం

నూతనంగా ఏర్పాటు చేసిన పోలవరం జిల్లా కలెక్టర్ గా కె దినేష్ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు పాడేరు అల్లూరి జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ విడుదల చేసిన ఉత్తరవుల ప్రకారం 2017 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ దినేష్ కుమార్ ను కలెక్టర్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఇప్పటివరకు వైద్య ఆరోగ్యశాఖ ఆయుష్ విభాగం డైరెక్టర్గా విధులు నిర్వర్తించారు. ఈయన ప్రభుత్వంలో పలు కీలక పదవులను నిర్వర్తించారు. నూతన జిల్లాకు సుమారు మూడు నెలల తర్వాత రెగ్యులర్ కలెక్టర్ నియమించడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular