ePaper
Monday, March 23, 2026
spot_img
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుఏప్రిల్ 1 వరకు కేజీబీవీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం 

ఏప్రిల్ 1 వరకు కేజీబీవీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం 

📰 Generate e-Paper Clip

ఆరవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ  

జీకే వీధి కేజీబీవీ ప్రత్యేక అధికారిణి నాగలక్ష్మి

గూడెంకొత్తవీధి,పెన్ పవర్,మార్చి 23:

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జీకేవీధి కేజీబీవీ ప్రత్యేక అధికారి నాగలక్ష్మి తెలిపారు. సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ 6వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం తో పాటు 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఆసక్తిగల విద్యార్థినుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారని తెలిపారు. ఏప్రిల్ 1 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఏప్రిల్ 13 నుంచి 17 వరకు సంబంధిత కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ధ్రువపత్రాలను పరిశీలించి సీట్లను కేటాయిస్తారని వెల్లడించారు. మధ్యలో చదువు మానేసి మళ్లీ విద్యను కొనసాగించాలనుకునే బాలికలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular