పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 23
పుల్లల చెరువు కేజీబీవీ పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గుడ్ టచ్- బాడ్ టచ్, పోక్సో చట్టం,గంజాయి,బాల్య వివాహాలు పై కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు సోమవారం పుల్లల చెరువు ఎస్ఐ సాంబశివరావు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సాంబశివరావు మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో చక్కటి లక్ష్యాలను ఎన్నుకుని సరైన మార్గంలో శ్రమిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు.గంజాయికి,నాటుసారకి అలవాటు పడితే జీవితాలు నాశనమవుతాయని, విచ్చలవిడిగా సాంకేతిక రంగం ద్వారా వారి దురాలవాట్లను మనకు రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మంచిని తీసుకుని చెడును వదిలేయాలని సూచించారు.యువత గంజాయి మత్తులో జీవితాలు నాశనం చేసుకుని కుటుంబాలకు శోకం మిగిల్చవద్దని సూచించారు.యువత చదువు, క్రీడలు తప్పా ఇంకో ఆలోచన దరికి చేరనీయొద్దన్నారు.పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పొక్సో యాక్ట్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లపై అవగాహన పరచడానికి పోక్సో పై చైతన్యం పేరుతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.బాల్యవివాహాల వల్ల కలుగు నష్టాలు, సమస్యలు తెలి యజేస్తూ వాటిని ప్రోత్సహించిన వారికి కఠినమైన శిక్షలు ఉంటాయన్నారు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టంపై వివరించారు.ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటిని ఉపయోగించడంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పాఠశాల ఉపాద్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



