ePaper
Tuesday, March 24, 2026
spot_img
ePaper
Homeఆంధ్రప్రదేశ్ఆలోచనలు మారితేనే అధిక లాభాలు : ప్రత్తిపాటి

ఆలోచనలు మారితేనే అధిక లాభాలు : ప్రత్తిపాటి

📰 Generate e-Paper Clip

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికే ప్రభుత్వం రైతన్నా మీకోసం కార్యక్రమం ద్వారా రైతుల్లో చైతన్యం తీసుకొస్తోంది 

డిమాండ్ ఉన్న పంటల సాగుతో రైతులు తప్పక లాభాలు పొందుతారు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాలు, దిగుబడినిచ్చే పంటలపై రైతులకు అవగాహన తప్పనిసరి

అమీన్ సాహెబ్ పాలెం, అప్పాపురం గ్రామాల్లో రైతన్నా మీకోసంలో మాజీమంత్రి

అమీన్ సాహెబ్ పాలెంలో రూ.10లక్షలతో నిర్మించిన సీసీరోడ్డు ప్రారంభించి, మరో రూ.10లక్షలతో వేసే సీసీరోడ్డుకు శంకుస్థాపన చేసిన ప్రత్తిపాటి

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 23 :    

చిలకలూరిపేట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకుంటూ, కాలానికి తగినట్టు తమ ఆలోచనలు, సాగు విధానాలు మారుస్తూ, డిమాండ్ ఉన్న పంటల సాగుద్వారా రైతుల అధిక లాభాలు అర్జించాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు.

 

సోమవారం ఆయన నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెం, అప్పాపురం గ్రామాల్లో నిర్వహించిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత అమీన్ సాహెబ్ పాలెంలో రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన ప్రత్తిపాటి, మరో రూ.10లక్షలతో నిర్మించాల్సిన సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పలువురు రైతుల ఇళ్లకు వెళ్లి, ప్రభుత్వం సేద్యానికి, రైతులకు అందిస్తున్న సాయాన్ని వివరించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో మాట్లాడారు.

రైతాంగం ఆలోచనలు, సాగు విధానాలు మారితేసే సేద్యంతో అధికలాభాలు పొందడం సాధ్యమవుతుందని, ఈ విషయంపై ప్రతి రైతు తప్పకుండా ఆలోచన చేయాలని ప్రత్తిపాటి సూచించారు.

ప్రభుత్వం ఎక్కువ ప్రోత్సాహకాలు, రాయితీలు అందించే ఉద్యాన పంటలసాగుపై రైతాంగం దృష్టి సారించాలని, తొలిసారి సాగుచేపట్టేటప్పుడు రైతులు చిన్నచిన్న సమస్యలు ఎదుర్కొన్నా..తర్వాత అధిక లాభాలు పొందుతారని ప్రత్తిపాటి చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా పంటలసాగుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తాయని, వాటి ఆధారంగా ఏ ప్రాంతంలో ఏ పంటలు వేస్తే బాగుంటుందనే ఆలోచన చేసి రైతులు సాగుకు సన్నద్ధం కావాలని ప్రత్తిపాటి సూచించారు. డిమాండ్ అధికంగా ఉన్న పంటల సాగుతో కచ్చితంగా లాభాలు పొందుతారన్నారు. మిర్చి, పత్తి, పొగాకు వంటి వాణిజ్య పంటల సాగుకు అలవాటు పడిన రైతులు, వేరే పంటల సాగుపై మొగ్గుచూపడానికి ఇష్టపడటం లేదని, వారు కొత్త ఆలోచనలు చేయాలనే ప్రభుత్వం రైతన్నా మీకోసం కార్యక్రమం చేపట్టిందన్నారు. ఆదర్శ రైతులు, వ్యవసాయాధికారులు నిత్యం రైతులతో మాట్లాడుతూ, వారిలోచైతన్యం నింపాలని, వారిని కొత్త సాగు విధానాల వైపు మళ్లించాలని ప్రత్తిపాటి సూచించారు.

కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, జవ్వాజి మధన్ మోహన్, కామినేని సాయిబాబు, రైతు నాయకులు గుర్రం నాగపూర్ణ చంద్రరావు, గ్రామ నాయకులు పునాటి కోటేశ్వరరావు, గుర్రం రామారావు, గుర్రం ఉపేంద్ర, సర్పంచి కామినేని లలిత , నెల్లూరి రామారావు, గ్రామ నాయకులు నెల్లూరి హరిబాబు, జగదీష్ , గొట్టిపాటి రామారావు, మస్తాన్ వలి, శంకర్ రావు, అధికారులు ఏవో శ్రీలత, పంచాయతీ ఏఈ వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ వివరాలు

పేరు: SRIKANTH NARASIMHALA
హోదా: STAFF REPORTER
ప్రాంతం: CHILAKALURI PETA, PALNADU DIST
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular