- 2019 విజయంలో పీకే వ్యూహాల కీలక పాత్ర
- ‘రావాలి జగన్ – కావాలి జగన్’ నినాదం ప్రభంజనం
- 2024లో వైసీపీకి చేదు అనుభవం
- ఐప్యాక్ టీమ్‌తోనే ఎన్నికలకు వెళ్లిన జగన్
- పీకే దూరమవ్వడమే ఓటమికి కారణమన్న చర్చ
- ఎన్నికల ముందు పీకే చేసిన అంచనాలు నిజం
- పార్టీ పునర్నిర్మాణంపై జగన్ దృష్టి
- 2029 లక్ష్యంగా ముందస్తు వ్యూహాల సిద్ధం
- బీహార్‌లో ‘జన్ సూరాజ్’తో బిజీగా పీకే
- మళ్లీ కలిస్తే రాజకీయాల్లో భారీ మార్పుల అవకాశాలు
2019లో వైసీపీ విజయానికి కీలకంగా నిలిచిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మళ్లీ పార్టీకి చేరువవుతున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 2024 పరాజయం తర్వాత పార్టీని పునరుద్ధరించేందుకు జగన్ పీకే సలహాలను తిరిగి ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
స్టేట్ పొలిటికల్ బ్యూరో పెన్ పవర్ | అమరావతి | మార్చి 24 :
2019 ఎన్నికల్లో వైసీపీ సాధించిన ప్రభంజన విజయంలో ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు ఎలా సక్సెస్ అయ్యాయో రాష్ట్రంలో అందరికీ తెలిసిందే. అయితే ‘రావాలి జగన్ – కావాలి జగన్’ నినాదం అప్పట్లో ఏపీని ఊపేసింది. ఊరూరా వైసీపీ జెండా రెపరెపలాడిండి. అయితే 2024 ఎన్నికల సమయంలో మాత్రం వైసీపీ చతికిలపడింది. ఇందుకు పీకే దూరమవ్వడమే కారణం. కేవలం ఐప్యాక్ (I-PAC) టీమ్‌తోనే జగన్ ఎన్నికలకు వెళ్లడంతో అత్యంత దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకున్నారు. జగన్ 175 అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే ఇప్పుడు పార్టీని మళ్ళీ గాడిలో పెట్టేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారు. తన పాత మిత్రుడు పీకే వైపు చూస్తున్నట్లు పొలిటికల్స్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.కాగా 2024 ఎన్నికల ఫలితాలకు ముందు ప్రశాంత్ కిషోర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు అప్పట్లో ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తప్పదని కుండబద్దలు కొట్టారు. అంతేకాదు ఆ అంచనాలే నిజం అయ్యాయి. దీంతో వైసీపీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలతో జగన్ ప్రజల్లోకి వెళ్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించడంలేదని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీకే వంటి బలమైన వ్యూహకర్త మళ్లీ అవసరమని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు 2029 లక్ష్యాన్ని ఛేదించేందుకు మూడేళ్ల ముందే నుంచి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారని, ఇందులో భాగంగానే పీకేతో జగన్ సంప్రదింపులు చేస్తున్నారనే ప్రచారం రాష్ట్రంలో జోరుగా జరుగుతోంది.ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్ బీహార్‌లో జన్ సూరాజ్ పార్టీ పెట్టి ఆ ప్రయాణంలో బిజీగా ఉన్నారు. గతంలో ఆయన ‘నేను వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకున్నాను’ అని ప్రకటించారు. కానీ జగన్‌తో ఉన్న పాత పరిచయం కారణంగా వీరి కలయిక మళ్లీ సాధ్యమేననే విశ్లేషణలు జరుగుతున్నాయి. ఐప్యాక్ టీమ్ క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పని చేస్తే మళ్లీ విజయవంతమైన ఫలితాలు ఉంటాయని, అటు క్యాడర్‌లోనూ కొత్త ఉత్సాహం వస్తుందని వైసీపీ అగ్రనేతలు భావిస్తున్నారని తెలుస్తోంది.రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనే సామెత ఉండనే ఉంది. ఈ ప్రకారం జగన్, పీకే మళ్ళీ చేతులు కలిపితే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు జరగుతాయి. 2024 ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న జగన్.. మళ్లీ పీకే సలహాలు తీసుకుని సరికొత్త ‘జగన్ 2.0’ వ్యూహాన్ని ఎలా అమలు చేస్తారో చూడాలి.



