ePaper
Monday, May 11, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుఉత్తమ హెల్త్ అసిస్టెంట్‌గా సత్యనారాయణకు పురస్కారం

ఉత్తమ హెల్త్ అసిస్టెంట్‌గా సత్యనారాయణకు పురస్కారం

📰 Generate e-Paper Clip

ఉత్తమ హెల్త్ అసిస్టెంట్‌గా సత్యనారాయణకు పురస్కారం

  1. గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 24:గూడెం కొత్తవీధి మండలంలోని రింతాడ పంచాయతీ పరిధిలో ప్రజారోగ్య సేవలందిస్తూ విశేష ప్రతిభ కనబరిచిన హెల్త్ అసిస్టెంట్ మడపల సత్యనారాయణకు ఉత్తమ హెల్త్ అసిస్టెంట్ పురస్కారం లభించింది.వరల్డ్ టిబి దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అల్లూరి జిల్లా డీఎంహెచ్‌వో కృష్ణమూర్తి నాయక్, ఐటిడిఏ పిఓ తిరుమని శ్రీ పూజ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేశారు.రింతాడ పంచాయతీ హెల్త్ సబ్ సెంటర్ 1, 2 పరిధిలోని గ్రామాల్లో ప్రజలకు వ్యాధుల నివారణపై అవగాహన కల్పించడం, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నియంత్రణలో సక్రమ చర్యలు తీసుకోవడం ద్వారా సత్యనారాయణ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారు.విధి నిర్వహణలో చూపిన నిబద్ధత, ప్రజల ఆరోగ్యంపై చూపిన శ్రద్ధకు గుర్తింపుగా ఈ పురస్కారం ప్రదానం చేసినట్లు అధికారులు తెలిపారు.స్థానిక ప్రజలు, సహోద్యోగులు సత్యనారాయణను అభినందించారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular