ePaper
Saturday, March 28, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పల్నాడుగణపవరంలో పోలీసుల కార్డన్ సెర్చ్

గణపవరంలో పోలీసుల కార్డన్ సెర్చ్

📰 Generate e-Paper Clip

మారణాయుధాలు, 70 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

చిలకలూరిపేట , పెన్ పవర్, మార్చి 26 :

నాదెండ్ల : గణపవరం గ్రామంలో పోలీసులు తెల్లవారుజామున భారీ స్థాయిలో ‘కార్డన్ సెర్చ్’ తనిఖీలు నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ విస్తృత తనిఖీలు చేపట్టారు.

అడిషనల్ ఎస్పీ నిరంజన్, డీఎస్పీ హనుమంతురావు ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన ఈ ఆపరేషన్‌లో 30 మంది ఉన్నతాధికారులు, దాదాపు 200 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి వీధిని, అనుమానిత ఇళ్లను జల్లెడ పట్టారు.ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని వాహనాలతో పాటు భారీగా మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

70 ద్విచక్ర వాహనాలు,23 గొడ్డళ్లు,11 గడ్డపారలు,ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వ్యసనాలకు పాల్పడినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో గానీ, డీఎస్పీకి గానీ సమాచారం అందించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular