ePaper
Friday, March 27, 2026
ads
ePaper
Homeఆంధ్రప్రదేశ్పల్నాడుప్రజా రంజక పాలనలో భావి రాజకీయ తరాలకు, పార్టీలకు అసలైన మార్గదర్శి చంద్రబాబు : ప్రత్తిపాటి

ప్రజా రంజక పాలనలో భావి రాజకీయ తరాలకు, పార్టీలకు అసలైన మార్గదర్శి చంద్రబాబు : ప్రత్తిపాటి

📰 Generate e-Paper Clip

  • రామరాజ్యానికి నిలువెత్తు నిర్వచనం నేటి కూటమి ప్రభుత్వ పాలన
  • ప్రజలకు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు, జనసేన, బీజేపీ శ్రేణులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 26 :

చిలకలూరిపేట : రాష్ట్ర ప్రజలకు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు, మిత్ర పక్షాలైన జనసేన , బీజేపీ శ్రేణులకు శ్రీ రామ నవమి పర్వదిన శుభాకాంక్షలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ, విభజనానంతర ఏపీలో గానీ రామ రాజ్యం అనే మాటకు సజీవ తార్కాణంగా నిలిచిన సుపరిపాలన అందించిన ఏకైక రాజకీయపార్టీ తెలుగుదేశం మాత్రమే. స్వర్గీయ నందమూరి తారక రాముడు చూపిన మార్గంలో ప్రజారంజక, ప్రగతి దీపిక పాలన సాగించడంలో భావి రాజకీయ తరాలకు, పార్టీలకు అన్నివేళలాఅసలైన మార్గదర్శిగా నిలుస్తున్నారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన నాయకత్వంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలన కూడా రామరాజ్యమనే మాటకు నిలువెత్తు నిర్వచనంగా నిలుస్తోంది. ప్రజల సుఖసంతోషాలే కొలమానంగా, రాష్ట్ర ప్రగతే పరమావదిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు.. చేపడుతున్న చర్యలు.. ఆచరణలో పెడుతున్న ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి సోపానాలు అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అని మాజీమంత్రి ప్రత్తిపాటి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular