ePaper
Friday, March 27, 2026
ads
ePaper
Homeఆంధ్రప్రదేశ్పల్నాడుమార్కాపురం దుర్ఘటన అత్యంత విషాదకరం : ప్రత్తిపాటి

మార్కాపురం దుర్ఘటన అత్యంత విషాదకరం : ప్రత్తిపాటి

📰 Generate e-Paper Clip

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దహనం ఘటనలో 14 మంది మృత్యువాత పడటం తీవ్రంగా కలచివేసింది.

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 26 :

చిలకలూరిపేట : మార్కాపురం జిల్లా రాయవరం సమీపాన జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దహనం దుర్ఘటన అత్యంత విషాదకరం. ఈ ఘటనలో 14 మంది సజీవ దహనమయ్యారన్న వార్త తీవ్రంగా ఆవేదనకు గురయ్యాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాడ సానుభూతిని, సంతాపాన్ని తెలియ చేస్తున్నాను.

దుర్ఘటనపై ప్రభుత్వ యంత్రాంగం సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టడంతో ప్రమాదంలో గాయపడిన వారిని సకాలంలో ఆసుపత్రులకు తరలించడం సాధ్యమైంది. దుర్ఘటనలో గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు మెరుగైన వైద్య సేవలతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయి. ప్రభుత్వాలు అందించే చేయూతతో తమవారిని కోల్పోయిన వారి హృదయవేదన ఎప్పటికీ తీరదనేది వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు (ఒక్కో కుటుంబానికి) రూ.5 లక్షలు గాయపడిన వారికి రూ.2 లక్షల పరిహారం ప్రకటించి కొంత మేర అండగా నిలిచింది. అలానే కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం ప్రకటించింది.” అని మాజీమంత్రి ప్రత్తిపాటి ఒక ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular