ePaper
Saturday, March 28, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్డీ లిమిటేషన్... ఎవరికి లాభం... ఎవరికి నష్టం

డీ లిమిటేషన్… ఎవరికి లాభం… ఎవరికి నష్టం

📰 Generate e-Paper Clip

 

  • సీట్ల పెంపు & మహిళా రిజర్వేషన్లు: ఎవరికీ లాభం? ఎవరికీ నష్టం?
  • డీలిమిటేషన్‌తో ఏపీ రాజకీయాల్లో భారీ మార్పులు
  • అసెంబ్లీ, లోక్‌సభ సీట్ల పెంపు లెక్కలు ఎలా ఉన్నాయి?
  • మహిళా రిజర్వేషన్లతో మారనున్న రాజకీయ సమీకరణాలు
  • సీనియర్ నేతలకు కొత్త సవాళ్లు ఎందుకు?
  • నియోజకవర్గాల పునర్విభజన ప్రభావం ఏంటి?
  • ఎన్నికల ఫలితాలపై డీలిమిటేషన్ ప్రభావం ఎలా ఉంటుంది?

స్టేట్ పొలిటికల్ బ్యూరో పెన్ పవర్ మార్చి 28:

డీలిమిటేషన్. కేంద్రం ఇచ్చిన ఒకే ఒక్క స్టేట్‌మెంట్‌తో సీట్ల పెంపు ఆశలు పీక్స్‌కు చేరాయి. అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలు పెరగడమే కాదు..ఉమెన్ రిజర్వేషన్లు కూడా అమలయ్యే సిచ్యువేషన్ ఉండటంతో..పార్టీల ఈక్వేషన్స్‌ మారుతున్నాయి. లీడర్ల లెక్కలు తారుమారయ్యే పరిస్థితి ఉందినియోజకవర్గాల పెంపు పొలిటికల్ హీట్‌ను పెంచుతోంది. లోక్ సభతో సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. ఇప్పటికే నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఈ పార్లమెంట్ సెషన్‌లోనే బిల్లును తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ, ఎంపీ సీట్లు పెరగడం ఒక ఎత్తు అయితే..మహిళా రిజర్వేషన్లు కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఏపీలో నియోజకవర్గాల పునర్విభజనతో ప్రస్తుతమున్న 175 స్థానాలు 263కి చేరనున్నాయి. 25 లోక్‌సభ స్థానాలు 38 అవుతాయి. ఈ లెక్కన జిల్లాల వారీగా పెరిగే సీట్లపై లెక్కలు తెరమీదకు వస్తున్నాయ్‌.సామాజిక సమీకరణాలు..ఉమెన్ రిజర్వేషన్‌ల అమలు పవర్‌ను డిసైడ్ చేయటంలో కీరోల్ ప్లే చేయనున్నాయి. అధికారంలోకి రావటానికి మ్యాజిక్ ఫిగర్ 132 కానుంది. ప్రతిపక్ష హోదా దక్కాలంటే 26 స్థానాలు రావాల్సి ఉంటుంది. మంత్రివర్గ సభ్యుల సంఖ్య 39 వరకు ఉండనుంది. నియోజకవర్గాల పునర్విభజన, మహిళ కోటా ఇంప్లిమెంటేషన్..ఏపీ పొలిటికల్ సినారియోనే మార్చేయనుంఅదనంగా నియోజకవర్గాలు పెరుగుతున్నాయన్న ఆనందం ఒకవైపు ఉంటే, మహిళా రిజర్వేషన్లు నేతలను టెన్షన్ పెడుతున్నాయట. ఏపీలో అసెంబ్లీ సీట్లు 263కి పెరిగితే, ఇందులో 80 సీట్లు మహిళలకు రిజర్వ్‌ అయ్యే ఛాన్స్ ఉంది. ఉమెన్ కోటా అమలులోకి వస్తే ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న చాలామంది నేతల నియోజకవర్గాల్లో రిజర్వేషన్లు మారే అవకాశం ఉంది. దాంతో నేతలు లెక్కల్లో బిజీ అయిపోయారు. నియోజకవర్గాల్లో జనాభా లెక్కలపై ఆరా తీస్తూ..ఏయే నియోజకవర్గాల్లో మహిళల ఓట్లు అత్యధికంగా ఉన్నాయో..ఎక్కడెక్కడ రిజర్వేషన్లు మారే అవకాశం ఉందో పరిశీలిస్తూ..ఇప్పటినుంచే అలర్ట్ అవుతున్నారట.2011 జనాభా లెక్కల ప్రకారం కేంద్రం డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టనుంది. ఇలా చూసినా పలువురు సీనియర్లు, ముఖ్యనేతల స్థానాలు మహిళలకు రిజర్వ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, వైసీపీ అధినేత జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో మహిళల ఓట్లు అత్యధికంగా ఉండటం ఉత్కంఠ రేపుతోంది.ఏపీలో ఓట్లపరంగా అతిపెద్ద నియోజకవర్గం భీమిలి. ఇక్కడ దాదాపు 3 లక్షల 55 వేల ఓట్లు ఉన్నాయి. ఇందులో సగానికి పైగా అంటే దాదాపు ఒక లక్షా 80 వేల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. గాజువాక, పెనమలూరు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాలు కూడా ఓట్ల పరంగా భీమిలి తర్వాతి స్థానంలో నిలిచాయి. ఈ నియోజకవర్గాల్లో కూడా మహిళా ఓటర్లు అధికంగానే ఉన్నారని చెబుతున్నారు. డీలిమిటేషన్ తర్వాత గాజువాక, పెనమలూరు, విజయవాడ సెంట్రల్ సెగ్మెంట్లు కూడా మహిళలకు రిజర్వ్‌ అవుతాయా? అనేది చర్చగా ఉందఇక సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 30 వేల మంది ఓటర్లు ఉండగా, ఇందులో మహిళా ఓటర్లు లక్షా 17వేల మంది. ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో రెండు లక్షల 34 వేల ఓట్లు ఉంటే ఇందులో మహిళా ఓటర్లు 1.19 లక్షల మంది. మంత్రి నారా లోకేశ్ నియోజకవర్గం మంగళగిరిలో మొత్తం ఓటర్లు 2 లక్షల 95 వేలు. ఇందులో మహిళలు లక్షా 51 వేల మంది. ఇక మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ నియోజకవర్గం పులివెందులలో కూడా పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. పులివెందులలో 2 లక్షల 34 వేల మంది ఓటర్లు ఉంటే.. అందులో లక్షా 19వేల మంది మహిళలు ఉన్నారు. రాష్ట్రంలోని మొత్త ఓటర్లలో సగం కంటే ఎక్కువగా మహిళలే ఓటర్లుగా ఉండటంతో..సీనియర్ లీడర్లకు రిజర్వేషన్ల జ్వరం పట్టుకున్నట్లు ఇన్‌సైడ్‌ టాక్. ఏపీలో చాలా నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు పురుషుల కంటే 2 నుంచి 4 శాతం అధికంగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అందుకే సంక్షేమ పథకాలు, రాజకీయ సమీకరణాల్లో మహిళా ఓటు బ్యాంక్‌పై పార్టీలు, నేతలు ఎక్కువ ఫోకస్ చేస్తుంటారని అంటున్నారు. అయితే మహిళలు చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఏర్పడటంతో ఓవరాల్‌ పొలిటికల్ ఈక్వేషన్స్‌ మొత్తం మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది.ఓ వైపు 175 అసెంబ్లీ సీట్లు 263కు పెరుగుతున్నాయన్న ఆనందం..కొత్త వారికి అవకాశం వస్తుందన్న ఆశలు..అలా ఉండగా..ఉమెన్ కోటా పార్టీలకు, లీడర్లకు టెన్షన్ పుట్టిస్తోంది. కంచుకోట లాంటి తమ నియోజకవర్గాల్లో రిజర్వేషన్లు మారితే పక్కనున్న మరో సెగ్మెంట్‌కు షిఫ్ట్ కావాల్సిన పరిస్థితి. అదే జరిగితే మరో నియోజకవర్గానికి మారితే గెలుపు అవకాశాలు అంత ఈజీగా ఉండకపోవచ్చు. పైగా మహిళలకు 80 సీట్లు రిజర్వ్‌ కానున్నాయి. 80 మంది బలమైన మహిళా నేతలను పోటీలో పెట్టి గెలిపించుకోవడం కూడా పార్టీలకు సవాల్‌గా మారనుంది. ఒకేసారి రెండు కీలక అంశాలు ఎన్నికల రేసును మార్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డీలిమిటేషన్‌తో ఎవరి సీట్లు గల్లంతు కాబోతున్నాయో? మహిళా రిజర్వేషన్లతో ఎవరి సీటుకు ఎసరు వస్తుందో..? అటు డీలిమిటేషన్..ఇటు ఉమెన్ కోటా ఎన్నికల ఫలితాలను ఎలా డిసైడ్ చేస్తాయో చూడాలి మరి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular