ePaper
Sunday, March 29, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుపెద్దజడుమూరులో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం

పెద్దజడుమూరులో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం

📰 Generate e-Paper Clip

గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మార్చి29: గూడెం కొత్త వీధి మండలం సంకాడ పంచాయతీ పరిధిలోని పెద్దజడుమూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ (టిడిపి) 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ టిడిపి కమిటీ అధ్యక్షుడు దేశగిరి గోవిందరావు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా టిడిపి వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ గిరిజనులు, బడుగు బలహీన వర్గాల అభ్యుదయం కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ మామిడి చంటిబాబు, బూత్ ఇంచార్జ్, పేసా గ్రామ కమిటీ కార్యదర్శి సడ్డ బుజ్జి పాడల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular