ePaper
Tuesday, May 19, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంబ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందిన సీఆర్‌ఎంటీ ప్రసాద్ కుటుంబానికి ‘చేయూత’ ఆర్థిక సాయం

బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందిన సీఆర్‌ఎంటీ ప్రసాద్ కుటుంబానికి ‘చేయూత’ ఆర్థిక సాయం

📰 Generate e-Paper Clip

 

గంగవరం , ఏప్రిల్ 3 (పెన్ పవర్):
మండల విద్యాశాఖలో సీఆర్‌ఎంటీ (CRMT)గా విధులు నిర్వహిస్తూ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతూ మృతి చెందిన దుమ్ముల ప్రసాద్ కుటుంబానికి ‘చేయూత’ స్వచ్ఛంద సేవా సంస్థ అండగా నిలిచింది. నెల్లిపూడి గ్రామానికి చెందిన ప్రసాద్ అకాల మరణం పట్ల సంస్థ ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఏజెన్సీ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) మల్లేశ్వరరావు సమక్షంలో, చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు రవికుమార్, ఏపీసీఆర్‌పీడబ్ల్యూఏ రాష్ట్ర అధ్యక్షులు రాంజీ ప్రసాద్ ఆధ్వర్యంలో మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి మనోధైర్యం కల్పిస్తూ, తక్షణ ఆర్థిక సాయం కింద రూ.50,000 నగదును అందజేశారు.ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు మాట్లాడుతూ, ప్రసాద్ పిల్లల విద్యాభ్యాసానికి తమ సంస్థ తరఫున పూర్తి సహకారం అందించడమే కాకుండా, వారి భవిష్యత్తుకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు భాషా, శ్రీరామ్, సుభాన్, పవన్ కల్యాణ్, విష్ణు నాయుడు, సత్య, లలిత, తేజ తదితరులు పాల్గొని బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular