అడ్డతీగల, పెన్ పవర్, ఏప్రియల్ 04: అడ్డతీగల మండలం లో6 పంచాయతీ ల ప్రత్యేక అధికారిగా అడ్డతీగల ఎంపీడీవో కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు.అడ్డతీగల, కొనలోవ, రాయపల్లి, తిమ్మాపురం, బొడ్లంక, తుంగమడుగుల ఈ ఆరు గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సంబంధిత పంచాయతీ అభివృద్ధి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, రానున్న వేసవి కాలంలో తాగు నీటికి ఎద్దడి లేకుండా రక్షిత తాగునీటి పథకాలు , చేతి పంపులు సక్రమంగా పని చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని, ఆరు పంచాయతీల సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీలలో ప్రధాన కూడలి లో చలివేంద్రములును ఏర్పాటు చేయవలసినదిగా పంచాయతీ ప్రత్యేక అధికారి ఎంపీడీవో కుమార్ ఆదేశించారు. అలాగే గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలు ప్రతిరోజూ నిర్వహించి, అలాగే గ్రామ పంచాయతీలో ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు మరియు సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవలసినదిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మండలంలో ప్రజలకు ఏ సమస్య ఉన్న తనను నేరుగా సంప్రదించి తెలియజేయవలసిందిగా పంచాయతీ ప్రత్యేక అధికారి కుమార్ తెలిపారు.

