వై రామవరం, పెన్ పవర్, ఏప్రిల్ 4 : మూగజీవాల దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో గతంలో నిర్మించిన నీటి తొట్టెలు నీరు లేకపోవడంతో నిరుపయోగంగా మారాయని స్థానికుల ఆరోపిస్తున్నారు.
వేసవిలో మూగజీవాల దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో అనుకూలమైన ప్రదేశాలలో నీటి తొట్టెలను ప్రజా ధనంతో నిర్మించారని స్థానికుల అంటున్నారు. నిర్మించిన తొలి సంవత్సరంలోనే నీతి తోట్టెల్లో నీరు ఉండేదని, నిర్వహణ లోపం కారణంగా వేసవికాలంలో కూడా నీటి తొట్టెలలో నీరు నింపే నాధుడే కరువయ్యాడని అంటున్నారు. ఈ నీటి తోటలను గతంలో పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహించేవారు అని, ప్రస్తుతం సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత నీటి తొట్టెల నిర్వహణ గాలికి వదిలేసారని స్థానికుల ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ఈ వేసవికాలంలోనైనా నీటి తొట్టెలలో మూగజీవన దాహార్తి తీర్చేందుకు నీటిని నింపవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయా గ్రామస్తులు కోరుచున్నారు.

