జగ్గంపేట పెన్ పవర్ ఏప్రిల్ 5 : కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ 119 వ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిడిపి కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బాబు జగ్జీవన్ రామ్ పాటుపడ్డారని కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేసి దండోరా జెండా ఆవిష్కరించారు.

