ePaper
Thursday, May 21, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడకుయ్యేరు గ్రామంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి

కుయ్యేరు గ్రామంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి

📰 Generate e-Paper Clip

కాజులూరు, ఏప్రిల్‌ 5: కాజులూరు మండలంలోని కుయ్యేరు గ్రామంలో 188వ బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలను గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.విగ్రహ దాత వాసంశెట్టి వెంకటరావు చేతుల మీదుగా గ్రామ ప్రజల సమక్షంలో స్థానికులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం కుయ్యేరు సెంటర్ బస్టాండ్ వద్ద అంబేద్కర్ మరియు బాబు జగజ్జీవన్ రావుల చిత్రపటాలకు పూలమాలలు వేసి గ్రామ పెద్దల సమక్షంలో చలివేంద్ర ఏర్పాటు చేశారు.ఈ చలివేంద్ర ద్వారా బాటసారులు, వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేసినట్లు గ్రామ పెద్దలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తాతపూడి రాజు,ప్రసాద్,ఎమ్మార్పీఎస్ నాయకులు, యువకులు ఇస్రాయేలు,మందపల్లి శీను బాబు వీర్రాజు,జోజి బాబు,సురేష్ వెంకట్, ప్రతీప్, శ్రీను నాని తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular