ePaper
Saturday, May 30, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుసంకాడ పంచాయతీలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

సంకాడ పంచాయతీలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 14 :సంకాడ పంచాయతీలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ జేఈఈ,పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ కళ్యాణ్, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు దేశగిరి గోవిందరావు, జనసేన నాయకుడు ఊలం ఈశ్వరరావు తదితరులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దేశగిరి గోవిందరావు మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా, ప్రముఖ సంఘ సంస్కర్తగా, ఆర్థికవేత్తగా, న్యాయవాదిగా దేశానికి విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. దళిత వర్గాల అభ్యున్నతికి, అంటరానితన నిర్మూలనకు జీవితాంతం పోరాడారని, స్వతంత్ర భారతదేశపు తొలి న్యాయశాఖ మంత్రిగా రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించి సమానత్వ సాధనకు కృషి చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సెక్రటరీ రాజుబాబు, జనసేన పంచాయతీ అధ్యక్షుడు ఊలం ఈశ్వరరావు, యూనిట్ ఇంచార్జి మామిడి, చంటిబాబు, కోశాధికారి దేశగిరి సంజీవరావు, ఉపాధ్యక్షురాలు రాలు సుభద్ర, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular