ePaper
Wednesday, June 17, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుఏపీఓ రాంప్రసాద్ సేవలు అభినందనీయం

ఏపీఓ రాంప్రసాద్ సేవలు అభినందనీయం

📰 Generate e-Paper Clip

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 23:జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏపీఓ చల్లంగి రాంప్రసాద్ సేవలు అభినందనీయమని ఎంపీపీ బోయినకుమారి, ఎంపీడీవో రమణబాబు పేర్కొన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఆయన సేవలను గుర్తిస్తూ శుక్రవారం ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీకే వీధి మండలం భౌగోళికంగా విస్తీర్ణం ఎక్కువగా ఉండి, మారుమూల గ్రామాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. అలాంటి ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా పండ్ల తోటల పెంపకం, రహదారుల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలను ఉపాధి హామీ పథకం ద్వారా ముందుకు తీసుకెళ్తూ విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. అధికారులు, సిబ్బంది, కార్మికులకు అందుబాటులో ఉంటూ నిత్యం సేవలందిస్తున్నారని తెలిపారు. తన విధి నిర్వహణను గుర్తించి సత్కరించినందుకు సంతోషంగా ఉందని ఏపీఓ రాంప్రసాద్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు ఆనందరావు, దేవుడు, ఎంపీటీసీ సభ్యులు రాజేశ్వరి, రాజులమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular