ePaper
Monday, May 25, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న ప్రత్తిపాటి

శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న ప్రత్తిపాటి

📰 Generate e-Paper Clip

  • పట్టణంలో పలుచోట్ల ఏర్పాటుచేసిన చలువ పందిళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 29:  

చిలకలూరిపేట : శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో పలుచోట్ల జరుగుతున్న మూడోరోజు వేడుకల్లో పాల్గొన్న మాజీమంత్రి ప్రత్తిపాటి.. భక్తులు, ఆలయాల నిర్వాహకులు అబ్బుర పరిచేలా ఏర్పాటు చేసిన నవమి పందిళ్లను (చలువ పందిళ్లు) ఆదివారం పరిశీలించారు. పలు చోట్ల పూజలందుకుంటున్న రాములోరి విగ్రహాలను దర్శించుకుని, అర్చకులు ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా బాలాజీ సంఘం, స్టీల్ దుకాణాల వీధి, మైదానం.. గౌడ వీధులు, చిల్లర కొట్ల బజార్, షరాఫ్ బజార్ లలో ప్రతిఏటా మాదిరే ఈ ఏడాది నవమి వేడుకల కోసం సిద్ధం చేసిన పందిళ్లను ప్రత్తిపాటి పరిశీలించారు. విద్యుత్ దీపకాంతులు, రంగురంగుల అలంకరణలతో ధగధగలాడుతున్న పందిళ్లలో కలియతిరిగిన ప్రత్తిపాటి.. స్థానిక దుకాణదారులు, ప్రజలతో మాట్లాడారు. శ్రీరామ నవమి వేడుకల్ని ఏటా శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించడం చిలకలూరిపేట పట్టణ వాసులకే దక్కిందని ప్రత్తిపాటి కొనియాడారు. టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, చెవూరి కృష్ణమూర్తి , అమరా రమాదేవి, కొత్త కోటేశ్వరరావు, కనమర్లపూడి రమేష్, తుబాటి శ్రీహరి, ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు, పలువురు నాయకులు, పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular