Homeఆంధ్రప్రదేశ్కాకినాడఅన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా పాలచర్ల నాగేంద్ర చౌదరి

అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా పాలచర్ల నాగేంద్ర చౌదరి

 

పెన్ పవర్ జగ్గంపేట

అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా జగ్గంపేటకు చెందిన పాలచర్ల నాగేంద్రబాబు నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం ట్రస్ట్ బోర్డు సభ్యులకు సంబంధించి జీవో విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 16 మందిని సభ్యులుగా నియమించగా దీనిలో నాగేంద్ర చౌదరికి స్థానం కల్పించారు. నాగేంద్ర చౌదరి చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు, హిందూ ధర్మ పరిరక్షణకు చేస్తున్న కృషిని ప్రభుత్వం గుర్తించి అన్నవరం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా ఎంపిక చేశారు. ఆయన చేస్తున్న సేవలకు అన్నవరం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా పదవి రావడం ఉత్తమమని పలువురు కొనియాడుతున్నారు. ఈ సందర్భంగా జగ్గంపేట కూటమి నాయకులు, ప్రముఖులు, హిందూ సంఘాల సభ్యులు నాగేంద్ర చౌదరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular