ePaper
Sunday, April 26, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుచామగెడ్డలో ముర్ల కుటుంబ వివాహ వేడుకకు టీడీపీ నాయకుల హాజరు

చామగెడ్డలో ముర్ల కుటుంబ వివాహ వేడుకకు టీడీపీ నాయకుల హాజరు

📰 Generate e-Paper Clip

గూడెం కొత్తవీధి మండలంలోని చామగెడ్డ గ్రామంలో ముర్ల కుటుంబ వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, తెలుగు యువత మండల కార్యదర్శి ముర్ల కోటేశ్వరరావు సోదరి వివాహ రిసెప్షన్ శనివారం జరిగింది.ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వి.వి. ప్రసాద్, గిరిజన జాగృతి వేదిక అధ్యక్షులు ముర్ల వెంకటరమణ, దేవరపల్లి సర్పంచ్ బుజ్జిబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు పొత్తూరు కొండలరావు, మాజీ జిల్లా కార్యదర్శి ముక్కలి మహేష్ పాల్గొన్నారు.అలాగే మండల నాయకులు కొర్ర బలరాం, రాజా భూపతి, మొట్టడం రామకృష్ణ, జనసేన మండల అధ్యక్షుడు కొయ్యం బాలరాజు తదితరులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular