ePaper
Wednesday, June 17, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లినర్సీపట్నంలో ఇద్దరు బైక్ దొంగలు అరెస్ట్

నర్సీపట్నంలో ఇద్దరు బైక్ దొంగలు అరెస్ట్

📰 Generate e-Paper Clip

ఇద్దరు బైక్ దొంగలు అరెస్ట్

నర్సీపట్నం, పెన్ పవర్ :

ఇద్దరు బైక్ దొంగలను నర్సీపట్నం టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. టౌన్ సిఐ గఫూర్ దీనికి సంబంధించిన వివరాలను మీడియా ముందుంచారు. ముందస్తు సమాచారం మేరకు శుక్రవారం ఉదయం తుని రూట్లో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలలో సిటీ 100 బైక్ అనుమానస్పదంగా అనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. వీరు తరచుగా వివిధ ప్రాంతాలలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారణ జరిగింది. ప్రధాన ముద్దాయి అనుమాను శ్రీను మరియు పెద్ద బొడ్డేపల్లి కి చెందిన ఓ మైనర్ బాలుడు ను అరెస్టు చేశారు. వీరి వద్దనుండి 4 బైకులు, 3 స్కూటీలు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నారు. అనుమాను శ్రీను పాత నేరస్తుడిగా గుర్తించారు. ఇతనిపై నక్కపల్లి పిఎస్ లో రెండు, ఉండ్రాజవరం లో ఒకటి, ఎలమంచిలి టౌన్ లో ఒకటి కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. ప్రధాన నిందితుడు శ్రీనును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు సిఐ గఫూర్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular