ePaper
Tuesday, May 12, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుఅడగరపల్లి గిరిజనుల ఆవేదన

అడగరపల్లి గిరిజనుల ఆవేదన

📰 Generate e-Paper Clip

గూడెం కొత్త వీధి పెన్ పవర్ మే 11:జీకేవీధి మండలం వంచుల పంచాయతీ పరిధిలోని అడగరపల్లి గ్రామంలో సుమారు 40 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. పంచాయతీ కేంద్రానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ గ్రామానికి ఇప్పటికీ సరైన రోడ్డు సౌకర్యం లేదు. వర్షాకాలంలో అనారోగ్యంతో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించడం కష్టంగా మారుతోంది.గ్రామంలో అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల లేక చిన్నారులు ప్రతిరోజూ దూరం నడిచి వెళ్లాల్సి వస్తోంది. రైతులు పండించిన పంటలను మార్కెట్‌కు తరలించడంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గ్రామానికి రోడ్డు నిర్మాణం చేయడంతో పాటు అంగన్వాడీ కేంద్రం, పాఠశాల ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులను అడగరపల్లి గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular