ePaper
Friday, May 8, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుదామనాపల్లి ఎంపీటీసీ కొర్ర భీమరాజు మృతి 

దామనాపల్లి ఎంపీటీసీ కొర్ర భీమరాజు మృతి 

📰 Generate e-Paper Clip

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మే 9:మండలంలో దామనాపల్లి పంచాయతీ భీమవరం గ్రామానికి చెందిన స్థానిక ఎంపీటీసీ కొర్ర భీమరాజు శుక్రవారం విశాఖపట్నంలో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.భీమరాజు మృతి వార్త తెలిసి మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన అంత్యక్రియలు స్వగ్రామమైన భీమవరంలో నిర్వహించనున్నట్లు సమాచారం.ఆయన మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular