ePaper
Monday, May 4, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

📰 Generate e-Paper Clip

మంత్రి వాసంశెట్టి సుభాష్

ప్రజా దర్బార్‌లో వినతులు స్వీకరణ

రామచంద్రపురం, పెన్ పవర్,మే 4:
ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. సోమవారం రామచంద్రపురంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను మంత్రికి వివరించారు. మొత్తం 60 వినతులు అందగా, వాటిలో పెన్షన్ల మంజూరు, ఇళ్ల స్థలాల కేటాయింపు, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు వంటి సమస్యలు ప్రధానంగా ఉన్నాయని తెలిపారు.అర్జీలను మంత్రి స్వయంగా పరిశీలించి, సంబంధిత అధికారులను వెంటనే స్పందించాలని, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు సమయానుకూలంగా న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, టిడిపి రాష్ట్ర బీసీ సెల్ నాయకులు పెంకే సాంబశివరావు, వనుం వీరబ్రహ్మం, చిర్రా సురేష్, టేకుమూడి సత్యనారాయణ, కట్టా నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular