టీడీపీ నాయకుల ఘన స్వాగతం
గంగవరం, పెన్ పవర్, జూన్ 19: పిడతమామిడి గ్రామ పంచాయతీకి నూతనంగా బదిలీపై వచ్చిన పంచాయతీ కార్యదర్శి శిరీష శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
పిడతమామిడి టీడీపీ అధ్యక్షుడు ముర్ల రామకిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు శిరీషను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
గ్రామ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయపడ్డారు. పిడతమామిడి గ్రామ అభివృద్ధికి పంచాయతీ కార్యదర్శి శిరీష కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వర్రే శ్రీనివాసరావు, నిడమర్తి శ్రీను, పాండు, సేనాపతి రాంబాబు, ప్రసాద్ రెడ్డి దాసరి, సింగిరెడ్డి ప్రసాద్ రెడ్డి, కాటమ స్వామి తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

