Homeతెలంగాణకళాకారులకు మూడు రోజుల శిక్షణ

కళాకారులకు మూడు రోజుల శిక్షణ

 

గార్ల, పెన్ పవర్, జులై 26:

ఈనెల 28 నుండి 30 వరకు ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో కళాకారులకు రాష్ట్రస్థాయి సాంస్కృతిక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ప్రజానాట్యమండలి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు అలవాల రామకృష్ణ అన్నారు గార్ల మండల కేంద్రంలోని ప్రజానాట్యమండలి మండల కమిటీ సమావేశం చింత ఎల్లయ్య అధ్యక్షతన ఆదివారం జరగగా ఈ సమావేశంలో రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ గార్ల మండల కేంద్రంలో జరిగే సాంస్కృతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగబోతున్నాయని అన్నారు రాష్ట్ర నలుమూలల నుండి 250 మంది కళాకారులు శిక్షణ తరగతుల్లో పాల్గొన్న పాల్గొన్న పోతున్నారు పాలకవర్గాల అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కళాకారులు తమ ఆట పాటల ద్వారా నూతన చైతన్యాన్ని తీసుకురావడంలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తారని వారు గుర్తు చేశారు కలలనే వృత్తిగా ఎంచుకొని జీవిస్తున్న వృత్తి కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు రాబోయే కాలంలో నైపుణ్యం కలిగిన కళాకారులను ప్రభుత్వం గుర్తించి వారికి ప్రతి నెలకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి సంక్షేమ పథకాల్లో పేద కళాకారులను గుర్తించి వారికి అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అర్హత కలిగిన కళాకారులందరికి ఇండ్ల స్థలాలు మరియు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఈనెల 28 నుండి 30 వరకు గార్ల మండల కేంద్రంలోని వర్తక సంఘం భవన్లో జరిగే రాష్ట్రస్థాయి సాంస్కృతిక శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి నక్క సైదులు జిల్లా కమిటీ సభ్యులు సంగు నాగేంద్ర పవన్ కుమార్ వంగూరు వీరభద్రం డప్పు రమేష్ వంగూరు కొండల్ సంగు ఉమావతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular