Homeఆంధ్రప్రదేశ్నిరుద్యోగ యువతకు 'లక్ష్యం'తో ఉద్యోగావకాశాలు

నిరుద్యోగ యువతకు ‘లక్ష్యం’తో ఉద్యోగావకాశాలు

జిల్లా ఉపాధి సెల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ నిషాంతి

Zస్టాఫ్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్త వీధి,పెన్ పవర్,జూలై 25: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం’లక్ష్యం–జిల్లా ఉపాధి సెల్’ ను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పోస్టర్‌ను శనివారం ఐటిడిఏ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ నిషాంతి టి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “మన జిల్లా–మన లక్ష్యం, మన భవిష్యత్తు” నినాదంతో కలెక్టరేట్ కేంద్రంగా జిల్లా ఉపాధి సెల్ పనిచేస్తుందని తెలిపారు. ఉపాధి కోసం ఎదురుచూస్తున్న యువత స్కిల్ డెవలప్మెంట్ అధికారుల ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువత బయోడేటాను వెబ్‌సైట్‌లో నమోదు చేసి,అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చిన వెంటనే సమాచారం అందజేసి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కూడా అందించనున్నట్లు వెల్లడించారు.ఈ పథకం వివరాలకు 9885507887, 9493417604 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని, అలాగే naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని అర్హులైన యువతీ యువకులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి (పీవీటీజీ) ఎం. వెంకటేశ్వరరావు, ఏపీఓ (జనరల్) టి. మరతమ్మ, స్కిల్ డెవలప్మెంట్ అధికారి ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular