Homeఆంధ్రప్రదేశ్కాకినాడకాజులూరు మండలానికి కొత్తగా 15 మంది సచివాలయ కార్యదర్శులు

కాజులూరు మండలానికి కొత్తగా 15 మంది సచివాలయ కార్యదర్శులు

  • కాజులూరు, జూలై 18, పెన్ పవర్: వివిధ మండలాల నుంచి పదోన్నతిపై (అప్‌గ్రేడ్) కాజులూరు మండలానికి కొత్తగా 15 మంది గ్రామ సచివాలయ కార్యదర్శులు నియమితులయ్యారు. శనివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీడీవో జె. రాంబాబు నూతన కార్యదర్శులను ప్రజాప్రతినిధులకు పరిచయం చేశారు.
    కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కార్యదర్శుల్లో తనుమళ్ల సచివాలయానికి మహ్మద్ సియాజ్, ఉప్పుమిల్లి సచివాలయానికి ఎం. మణికంఠ, కాజులూరు-2కు మహ్మద్ ఆజారుద్దీన్,కాజులూరు-3కు రవిచరణ్, ఆర్యవటం-కె.విశ్వేశరరావు,శలపాక పి.సునీల్,మంజేరుకు ఎం. వీరబాబు,కోలంకకు పి.వి.సుధాకర్, కుయ్యేరుకు పి. త్రిమూర్తులు, అయితపూడికి డి.పి.వి.ఎస్. ప్రసాద్, బంధనపూడికి కె. లక్ష్మమ్మ, టి. మామిడాడకు పి. విజయ్ కుమార్, తణుకువాడకు కె. రామచైతన్య తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా ఎంపీడీవో జె. రాంబాబు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రభుత్వ సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాల అమలులో కార్యదర్శులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular