Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంజనసేన సంస్థాగత నిర్మాణానికి దరఖాస్తుల స్వీకరణ విజయవంతం

జనసేన సంస్థాగత నిర్మాణానికి దరఖాస్తుల స్వీకరణ విజయవంతం

  • జనసేన సంస్థాగత నిర్మాణానికి దరఖాస్తుల స్వీకరణ విజయవంతం

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం, జూలై 4: జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన పార్టీ సారథుల సమాచార సేకరణ, వివిధ సంస్థాగత పదవుల కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఆరవ రోజు కూడా విజయవంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు, మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొని సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, కార్యకర్తల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత అవకాశం కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించామని, ఆ గడువు ఆదివారంతో ముగియనుందని వెల్లడించారు.పార్టీ అభివృద్ధికి సేవలు అందించాలనే సంకల్పంతో ఉన్న ప్రతి కార్యకర్త ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దేందుకు సంస్థాగత నిర్మాణ ప్రక్రియ కీలకమని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular