బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం జులై 04 : మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా శనివారం జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వరనాయుడు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ టి. గోవిందు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగాలు, ఆయన ప్రదర్శించిన ధైర్యసాహసాలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. యువతతో పాటు ప్రతి పౌరుడు అల్లూరి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బి.వి. రాణి, వివిధ శాఖల సూపరింటెండెంట్లు, అధికారులు, ఉద్యోగులు పాల్గొని అల్లూరి సీతారామరాజుకు ఘనంగా నివాళులర్పించారు.

