విశాఖలో అల్లూరి జయంతి వేడుకలు
- వైఎస్సార్‌సీపీ నేతల ఘన నివాళి.. వృద్ధులకు పండ్ల పంపిణీ
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం జులై 04 : స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం విశాఖపట్నంలోని సీతమ్మధారలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె. రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు, విశాఖ తూర్పు నియోజకవర్గ పరిశీలకురాలు పేడాడ రమణికుమారి పాల్గొని అల్లూరి సీతారామరాజు సేవలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, నియోజకవర్గ పరిశీలకులు రొంగలి జగన్నాధం, సతీష్ వర్మ, జహీర్ ఆహ్మద్, రాష్ట్ర, మాజీ జిల్లా కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ జీవీఎంసీ కార్పొరేటర్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, నగర జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, వార్డు అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

