Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంకాంగ్రెస్ జాతీయ 'టాలెంట్ హంట్' కార్యక్రమం ప్రారంభం

కాంగ్రెస్ జాతీయ ‘టాలెంట్ హంట్’ కార్యక్రమం ప్రారంభం

 

 

కాంగ్రెస్ జాతీయ ‘టాలెంట్ హంట్’ కార్యక్రమం ప్రారంభం

 

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, జూలై 30 : కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఏఐసీసీ ఆధ్వర్యంలో ‘నేషనల్ టాలెంట్ హంట్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఏఐసీసీ–ఏపీ పీసీసీ కోఆర్డినేటర్, విశాఖ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ప్రియాంక దండి తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా రాజకీయాలపై ఆసక్తి కలిగి, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లగల యువతకు అవకాశాలు కల్పించనున్నట్లు ఆమె వెల్లడించారు. అలాగే పరిశోధన విభాగం (రిసెర్చ్) మరియు సోషల్ మీడియా ప్రచార విభాగాల్లో ప్రతిభ ఉన్న వారికి కూడా పార్టీలో పనిచేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు priyankaraodandi@gmail.com ఇ-మెయిల్ ద్వారా లేదా 6305821260 వాట్సాప్ నంబర్‌ను సంప్రదించి తమ వివరాలను పంపించాలని ప్రియాంక దండి కోరారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular