Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నం*పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు*

*పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు*

 

*పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు*

*ఎక్సలెన్సీ సెంటర్లలో విద్యార్థులకు ఇంటర్ తో పాటు జేఈఈ, నీట్ కి ఉచిత శిక్షణ*

*పేద పిల్లలు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పం*

*మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి*

*విశాఖ మధురవాడ డా.బి. ఆర్ అంబేద్కర్ గురుకులం ఎక్సలెన్సీ సెంటర్ లో మంత్రి డా. స్వామి ఆకస్మిక తనిఖీ*

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్            విశాఖ, జూలై 29 :

పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేశామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. బుధవారం విశాఖ మధురవాడ కొమ్మాదిలోని డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకులం ఎక్సలెన్సీ సెంటర్లో మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎక్సలెన్సీ సెంటర్లోని వంటగది, మరుగుదొడ్లు మంత్రి పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి ఎక్సలెన్సీ సెంటర్లో సౌకర్యాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు నీటి సమస్యను మంత్రి దృష్టికి తీసుకురాగా మంత్రి వెంటనే జీవీఎంసీ కమిషనర్ తో మాట్లాడి నీటి సమస్యను పరిష్కరించారు. ఎక్సలెన్సీ సెంటర్లో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగ్గా ఉండాలని సిబ్బందికి మంత్రి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ… పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు అంబేద్కర్ గురుకులాల్లో ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేశాం. ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా మరో 3 కో ఎడ్యుకేషన్ ఎక్సలెన్సీ సెంటర్లు (విశాఖ జిల్లా మేఘాద్రి గడ్డ, గుంటూరు జిల్లా తాడికొండ, తిరుపతి జిల్లా కోట) ఏర్పాటు చేశాం. ఎక్సలెన్సీ సెంటర్లలో విద్యార్థులకు ఇంటర్ తో పాటు జేఈఈ, నీట్ కి ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ అందిస్తున్నాం. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు ఈ ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేశాం. అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల ఆరోగ్యం,భద్రత, సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. బాలికల భద్రత కోసం అన్ని హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. గతంలో ఎన్నడూ లేని విధంగా వసతి గృహాల్లో ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా శానిటేషన్ సిబ్బందిని నియమించాం. అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. పేద పిల్లలు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పమని పేద విద్యార్థుల కోసం తమ ప్రభుత్వం ఎంత ఖర్చునైనా భరిస్తుందని
మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular