Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంగురుపౌర్ణమి వేళ ఈస్ట్ పాయింట్ సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రత్యేక పూజలు

గురుపౌర్ణమి వేళ ఈస్ట్ పాయింట్ సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రత్యేక పూజలు

గురుపౌర్ణమి వేళ ఈస్ట్ పాయింట్ సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రత్యేక పూజలు

  బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్       విశాఖపట్నం, జూలై 29 : గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తన సతీమణి పద్మజతో కలిసి ఈస్ట్ పాయింట్ సాయిబాబా ఆలయాన్ని బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి సాయిబాబా వారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ అర్చకులు అందజేసిన తీర్థప్రసాదాలను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ గురుపౌర్ణమి పర్వదినం భారతీయ సంస్కృతిలో విశిష్ట స్థానం కలిగిన పవిత్రమైన రోజు అని పేర్కొన్నారు. ఈ పుణ్యదినాన సాయిబాబా వారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. సాయిబాబా వారి కృపాకటాక్షాలతో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సి.ఎం.ఆర్. రమణ, అబ్బు, కూటమి నాయకులు, ముఖ్య నేతలు, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular