సింహాచలంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ , విశాఖపట్నం, జూలై 30: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర రహదారులు, భవనాల (ఆర్ & బి) శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి పూజలు నిర్వహించి మంత్రి దంపతులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.
మంత్రి వెంట సీఎం ప్రోగ్రామ్ కమిటీ కో-ఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఏలూరి సాంబశివరావు, పుత్తా చైతన్య రెడ్డి, నరేంద్ర వర్మ, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, రాష్ట్ర బెస్తా కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన శ్రీధర్ తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

